నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ELR: జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. పేరంపేట సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అయ్యప్ప టౌన్ షిప్, పేరంపేట రోడ్డు విద్యుత్ లైన్లకు అడ్డువచ్చిన చెట్ల కొమ్మలను తొలగించే పనుల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.