డంపు యార్డ్ నిర్మాణానికి 18 కోట్ల నిధులు: జగ్గారెడ్డి

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో డంపు యార్డు నిర్మాణానికి 18 కోట్ల రూపాయలు హెచ్ఎండీఏ నిధుల నుంచి మంజూరు చేయిస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. హెచ్ఎండిఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ చర్చిస్తానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన తయారు చేయాలని సంగారెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించారు.