అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: ఆడే గజేందర్

ADB: అర్హులందరికీ దశలవారీగా ఇళ్లు అందజేయడం జరుగుతుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాలలో ఆదివారం ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పర్యటించారు. పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.