ఏకగ్రీవాలు గ్రామాల అభివృద్ధికి నాంది: ఎమ్మెల్యే

ఏకగ్రీవాలు గ్రామాల అభివృద్ధికి నాంది: ఎమ్మెల్యే

VKB: తాండూర్ మండలంలోని 26 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కావడం ఎంతో హర్షణీయమని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న తాండూర్ నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన 26 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాలు ఏకగ్రీవం కావడం అభివృద్ధికి నాందిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివర్ణించారు.