మంచినీటి సరఫరా అందిస్తున్నాం: ప్రభాకరరావు

పార్వతీపురం మండలం తాళ్లబురిడికి నీటి సరఫరా పునరుద్ధరించడం జరిగిందని జిల్లా గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారి ప్రభాకరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డి.సిర్లాం విద్యుత్ హెడ్ వర్క్ ఏర్పడిన సమస్య కారణంగా మంచి నీటి సరఫరా తాత్కాలికంగా ఆగిందన్నారు. విద్యుత్ సమస్య పరిష్కరించిన వెంటనే తాళ్లబురిడి మంచినీటి సరఫరాను పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు.