రోడ్ రన్ వాల్ పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే
W.G: ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు రోడ్డు రన్ పేరుతో వచ్చే నెల 7న నిర్వహించనున్న పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నడక ద్వారా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారని చెప్పారు. అందులో భాగంగానే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.