సీఎం పర్యటన ఏర్పాట్లపై సన్నాహక సమావేశం

NDL: పాణ్యం నియోజకవర్గంలో 17వ తేదీన జరిగే స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం, పీ-4 మార్గదర్శి - బంగారు కుటుంబం కార్యక్రమం కోసం ఓర్వకల్లు మండల కేంద్రంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. గురువారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నేతృత్వంలో మండల, గ్రామ నాయకులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.