రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
GDWL: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా గద్వాల పట్టణంలో శనివారం "అరైవ్–అలైవ్" రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కళ్యాణ్ కుమార్, డాక్టర్ రిహాన్ ఫరాజ్ హాజరయ్యారు. ఎస్సై మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పుతుందని ప్రజలకు వివరించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోవాలన్నారు.