వ్యక్తి మిస్సింగ్.. కేసు నమోదు

KMR: కామారెడ్డి బతుకమ్మకుంటకి చెందిన మహమ్మద్ షబ్బీర్ (38) ఈనెల 13 నుంచి కనిపించకపోయాడు. ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీస్ స్టేషన్‌లకు ఫిర్యాదు చేశారు. అతనికి మతిస్థిమితం సరిగా లేదని పేర్కొన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి టౌన్ సీఐ చంద్రశేఖర్ పేర్కొన్నారు.