జిల్లాలో శాస్త్రీయ నృత్య పోటీలు.. అర్హులు వీరే

KRNL: నగరంలో ఈనెల 7న శాస్త్రీయ నృత్య పోటీలు నిర్వహించనున్నారు. శాంతి తెలుగు సాహితీ సమితి ఆధ్వర్యంలో నాట్యరత్న హెచ్. వెంకటస్వామి సంస్మరణ సభ సందర్భంగా పోటీలు నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షులు కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో పోటీలుంటాయన్నారు. 10 నుంచి 20 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు.