కోటి సంతకాలు సేకరణలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం
VZM: పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో వైసీపీ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను చెయ్యడం వలన పేద ప్రజలకు ప్రజా వైద్యం దూరమవుతుందని ఆరోపించారు. అలాగే వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.