ఈనెల 15న నరసాపురం-చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం
W.G: నరసాపురం నుంచి చెన్నైకు నూతన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రైలు నర్సాపురంలో మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి రాత్రి 11:45 గంటలకు చెన్నై చేరుకుంటుంది. రైలు భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, మీదుగా ప్రయాణిస్తుంది. ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఒక నెల ముందుగానే ప్రారంభిస్తున్నారు.