నేటి నుంచి మూడు రోజులు సెలవులు

నేటి నుంచి మూడు రోజులు సెలవులు

NGKL: అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌కు నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉన్నట్లు మార్కెట్ ఛైర్మన్ అంతటి రజిత మల్లేష్ తెలిపారు. ఈరోజు గుడ్ ఫ్రైడే, రేపు వారంతపు సెలవు, ఎల్లుండి జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మార్కెట్‌కు సెలవులు ఉన్నట్లు చెప్పారు. సోమవారం యథావిధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని తెలిపారు. రైతులు గమనించగలరని కోరారు.