కొండా సురేఖపై దావా.. విచారణ వాయిదా
TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఇరువాదనలు విన్న కోర్టు.. విచారణను మళ్లీ వాయిదా వేసింది. డిసెంబర్ 2కు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. కాగా, సమంత విడాకుల విషయంలో అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.