జిల్లాలో రికార్డు స్థాయిలో కంది సాగు

జిల్లాలో రికార్డు స్థాయిలో కంది సాగు

VKB: జిల్లాలో కంది సాగు విస్తీర్ణం ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. గత ఏడాది 1.04 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ సంవత్సరం అది 1.05 లక్షల ఎకరాలకు చేరింది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది జీఐ(GI) ట్యాగ్ దక్కించుకున్న తాండూరు కందిపప్పు పోషకాలు, రుచికి ప్రసిద్ధి చెందింది. రైతులు దీని సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.