రైతు భరోసా కోసం రైతన్న ఎదురుచూపు..!

రైతు భరోసా కోసం రైతన్న ఎదురుచూపు..!

MDCL: జిల్లా పరిధిలోని ఘట్‌ఖేసర్, శామీర్‌పేట, కీసర, ఎదులబాద్ సహా పలు ప్రాంతాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. యాసంగి కారు ప్రారంభమైనప్పటికీ, రైతు భరోసా అందకపోవడంతో రైతన్న ఇబ్బందులు పడుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చుల కోసం అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, కొంతమంది రైతులు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.