వ్యర్థాలపై కేరళ గ్రీన్‌ ఆర్మీ యుద్ధం

వ్యర్థాలపై కేరళ గ్రీన్‌ ఆర్మీ యుద్ధం

కేరళలో పేరుకుపోతున్న వ్యర్థాలపై హరిత కర్మసేన కార్యకర్తలు యుద్ధం ప్రకటించారు. హరిత యూనిఫాంలు ధరించిన మహిళలు ఒక చేత ఖాళీ బస్తాలు, మరో చేత లెడ్జరు పుస్తకాలతో ఇళ్ల తలుపులు తట్టి చెత్తను సేకరిస్తున్నారు. అనంతరం దానిని పారిశుద్ధ్య శుద్ధి కర్మాగారాల్లో ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువుల గుంతలకు తరలిస్తున్నారు. ఈ యుద్ధంలో దాదాపు 37 వేల మంది మహిళలు పాల్గొంటున్నారు.