నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
PDPL: గోదావరిఖని పట్టణంలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్-కో అధికారులు తెలిపారు. ఉల్లిగడ్డల బజార్ ప్రాంతంలో ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు, అలాగే మేదరి బస్తీలో మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. నిర్వహణ పనుల దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.