బ్లూమ్‌బర్గ్ మేయర్స్ చాలెంజ్ 2025 ఫైనలిస్ట్‌గా విశాఖ

VSP: గ్లోబల్ బ్లూమ్‌బర్గ్ మేయర్స్ చాలెంజ్ 2025లో జీవీఎంసీ ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 50 ఫైనలిస్ట్ నగరాలలో ఒకటిగా నిలిచిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. పట్టణ సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగొనడంలో విశాఖకు ఈ గుర్తింపు లభించిందన్నారు. "వైజాగ్-ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్" మోడల్ కోసం ప్రజల నుంచి సూచనలను స్వీకరించనున్నట్టు తెలిపారు.