విశాఖ పర్యాటక ప్రాంతాలు సందర్శించిన మంత్రి
విశాఖ పర్యాటక ప్రాంతాలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం సందర్శించారు. కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జిని పరిశీలించి, పర్యాటక ప్రాంతాలకు మరిన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విశాఖ పర్యాటక అభివృద్ధికి ఇంకా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయకుమార్, వీఎంఆర్డీఏ ఛైర్మన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.