రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి హత్య?

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక నారాయణ పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి భాస్కర్ రెడ్డి శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతని గొంతు మీద రక్తపు గాయాలు ఉండడంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై నారాయణ ఘటనా స్థలానికి చేరుకుని భాస్కర్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు.