ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత

VSP: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. 35వ వార్డు పరిధిలోని గాజుల వీధిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాంకేతికతను జోడించడం వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.