మోసం చేశారని పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు

మోసం చేశారని పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు

HYD: హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యాపారి ఆందోళన చేపట్టాడు. చంద్రికపురం ప్రాంతానికి చెందిన అనిల్ శర్మ, అతని కుమారుడు ప్రేమ శర్మ తనను రూ.18లక్షల మోసం చేశారని అగర్వాల్ రైస్ ఇండస్ట్రీస్ నిర్వాహకుడు మనోజ్ కుమార్ ఆరోపించారు. బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని, వారిపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని ఆయన పోలీసులను కోరారు.