న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలి: మాజీ మంత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హైకోర్టు న్యాయవాదుల ఆత్మీయ సత్కారం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి, న్యాయవాది చంద్రశేఖర్‌ను హైకోర్టు న్యాయవాదులు కలిసి వారి సమస్యలు, సంక్షేమంపై మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్ ఆయన మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి పవిత్రమైనదని, న్యాయవాద రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి వారి సంక్షేమానికి కృషి చేయాలన్నారు.