ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
AKP: అచ్యుతాపురం మండలం కొండకర్ల పీఏసీఎస్ అధ్యక్షులు గొంతిన భక్తసాయిరామ్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. పీఏసీఎస్ పరిధిలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వానియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే నగదు జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సిబ్బంది, మండల వ్యవసాయాధికారి శంకర గోవింద్, రైతులు పాల్గొన్నారు.