దుబ్బ మల్లన్న ఆలయ ఛైర్మన్‌గా రవి

దుబ్బ మల్లన్న ఆలయ ఛైర్మన్‌గా రవి

KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుబ్బ మల్లికార్జున స్వామి ఆలయ ఛైర్మన్‌గా ధర్మారం గ్రామానికి చెందిన ముద్దమల్ల రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవాదాయ శాఖ రెండు సంవత్సరాల కాలానికి ఐదుగురు ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించింది. అనంతరం సభ్యుల సమ్మతితో రవిని ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.