VIDEO: 'ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత'
ELR: జంగారెడ్డిగూడెంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆదివారం రాత్రి గురవాయిగూడెం మానస సరోవర్ వద్ద ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత యాంత్రిక జీవనంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని, అది మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని వివరించారు.