లారీ ఢీకొని మహిళ మృతి
BDK: దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న మహిళ అకస్మాత్తుగా జారి కిందపడింది. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఆమెను ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.