10 నౌకలను సముద్రగర్భంలో కలిపాం: ట్రంప్
ఇరాన్‌పై దాడుల విషయంలో US లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. తొలుత ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను నాశనం చేస్తున్నట్లు చెప్పారు. తర్వాత కొత్త క్షిపణులను తయారు చేసే వారి శక్తిని, ఆ దేశ నౌకాదళాన్ని తుడిచిపెడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 10 నౌకలను సముద్రగర్భంలో కలిపినట్లు పేర్కొన్నారు. టెహ్రాన్ ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్ అని ఆరోపించారు.