నలుగురు నిందితులు లొంగుబాటు

VZM: వృద్ధురాలు హత్య కేసులో నలుగురు నిందితులు లొంగిపోయినట్లు డీఎస్పీ భవ్యరెడ్డి గురువారం సాయంత్రం గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకరులకు తెలిపారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈనెల 16న రెల్లిగూడెం గ్రామానికి చెందిన రాళ్లపూడి అంకమ్మ (75)ను అదే గ్రామానికి చెందిన దానాల రాము, దుర్గమ్మ, రాములమ్మ, పాల్తేటి రాములప్పడులు హత్య చేశారని తెలిపారు.