ప్రజలను సీఎం జగన్ మోసం చేశారు: మీనాక్షి నాయుడు

ప్రజలను సీఎం జగన్ మోసం చేశారు: మీనాక్షి నాయుడు

కర్నూల్: ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని టీడీపీ ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు విమర్శించారు. ఆదోని అసెంబ్లీ కూటమి అభ్యర్థి పార్థసారథిని గెలిపించాలని నియోజకవర్గంలోని దిబ్బనకల్లులో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించామన్నారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం, అక్రమాలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు.