డిజిటల్ మైక్రో ATM సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే

డిజిటల్ మైక్రో ATM సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: జి.సిగడాం మండలం మదుపాం గ్రామంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ మైక్రో ATM సేవలతో కూడిన బ్యాంకింగ్ సేవలను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా నగదు ఉపసంహరణ, డిపాజిట్, డబ్బు బదిలీ వంటి సేవలను సులభంగా పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అప్పలనాయుడు ఉన్నారు.