మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య
PDPL: ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన దండు రాజు(47) గడ్డి మందు తాగి మరణించాడు. హమాలీ పనులు చేస్తూ మద్యానికి బానిసైన రాజు నిన్న మధ్యాహ్నం మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.