'బ్లాక్ ఫిల్మ్ వాడితే జరిమానా తప్పదు'
HNK: కారులో ప్రయాణించే వారిని గుర్తించేందుకు వీలు లేకుండా గ్లాసులకు బ్లాక్ ఫిల్మ్ అతికించడం నేరమని ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఓ కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను పోలీసులు తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. బ్లాక్ ఫిల్మ్ వాడితే రూ.500 నుంచి రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.