'శక్తి యాప్‌పై అవగాహన మహిళలకు అవసరం'
SKLM: మహిళలకు రక్షణగా ఉండే శక్తియాప్ పై అవగాహన అవసరమని శ్రీకాకుళం మహిళాపోలీస్ స్టేషన్ అధికారులు పేర్కొన్నారు. బుధవారం జిల్లా ప్రజారవాణా కాంప్లెక్స్‌లో పలువురు విద్యార్థులతోపాటు మహిళలకు యాప్ యొక్క ఫలితాలను తెలియజేశారు. స్వయంగా వారి మొబైల్లో శక్తియాప్ డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించారు. అత్యవసర సమయాలలో యాప్‌ను వినియోగించి పోలీసులకు ఫిర్యాదు చేయొచన్నారు.