ఐ లవ్ సూళ్లూరుపేట ఐకాన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: సూళ్లూరుపేట హోలీ క్రాస్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ సూళ్లూరుపేట అనే ఐకాన్ బోర్డుని ఎమ్మెల్యే విజయశ్రీ మంగళవారం ప్రారంభించారు. సూళ్లూరుపేటని ప్రజలకు ఆహ్లాదకరమైన టౌన్‌గా అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, కాళంగి నదికి ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్‌ను పూర్తిగా తీసివేసి అక్కడ పట్టణ ప్రజలకు పార్కు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.