VIDEO: రామపురం చెరువు తూము ధ్వంసం... సాగునీరు వృథా
WGL: నెక్కొండ మండలం సూరిపల్లి పరిధిలోని రామపురం చెరువు మిట్ట తూమును నిన్న రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. తూము వద్ద ఉన్న రేకును విరగ్గొట్టి తవ్వకాలు జరిపి చెరువు నీరు వృథాగా బయటకు వెళ్లేలా చేశారు. ఈ ఘటన వల్ల చెరువులో నీటి నిల్వకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనకు బాధ్యులైన దుండగులపై తక్షణం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.