వేతనాలు పెంచాలని అంగన్వాడీల నిరసన
W.G: అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం భీమవరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నేత వాసుదేవరావు మాట్లాడుతూ.. నెలాఖరు వస్తున్నా నేటికీ జీతాలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని, పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని తెలిపారు.