అన్నదాత సుఖీభవ పథకానికి 2,77,453 మంది

SKLM: కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదును జమ చేయనుంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 2,83,896 మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరిలో ఇప్పటికే 2,77,453 మంది రైతులు e-KYC పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. మిగిలిన 1,340 రైతులు మంది త్వరగా e-KYC పూర్తి చేసుకోవాలని సూచించారు.