చీడ పీడల నిర్ధారణపై రైతులకు అవగాహన కార్యక్రమం

NLR: ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట గ్రామంలో సోమవారం నెల్లూరు ఆత్మ (జిల్లా వనరుల కేంద్రం ) వాళ్ళు వివిధ పంటలను ఆశించు చీడ పీడల నిర్ధారణపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త మధుసూదన్ మాట్లాడుతూ... క్షేత్ర సందర్శనలో వరి మొక్కల్లో కంకి నల్లినీ గమనించారు. అనంతరం వీటి నివారణకు వాడుకోవాల్సిన మందులను రైతులకు వివరించారు.