VIDEO: ఈనెల 26న సింగరేణి ఆధ్వర్యంలో జాబ్ మేళా
KMM: సత్తుపల్లి సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 26న జాబ్ మేళా నిర్వహించనున్నారు. సంస్థ ఆధ్వర్యాన నిర్వహించే జాబ్ మేళా పోస్టర్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, MLA మట్టా రాగమయి శనివారం ఆవిష్కరించారు. సింగరేణి గనులతో కిష్టారం వాసులు నష్టపోయినందున పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.