VIDEO: కంభంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
ప్రకాశం: నేరాల నియంత్రణ లక్ష్యంగా కంభం పట్టణంలో శనివారం తెల్లవారుజామున సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ముఖ్యంగా సరైన డాక్యుమెంట్లు, నంబర్ ప్లేట్లు లేనటువంటి వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు మల్లికార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో కంభం, బేస్తవారిపేట ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.