'అంత పెద్ద పేలుడు ఎప్పుడూ వినలేదు'
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై అక్కడి స్థానిక దుకాణదారుడు (ప్రత్యక్ష సాక్షి) తీవ్ర భయాందోళన వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఇంత పెద్ద పేలుడు శబ్దం నేను ఎప్పుడూ వినలేదు. భారీ పేలుడు కారణంగా నేను మూడుసార్లు పడిపోయాను. మేమంతా చనిపోతామేమో అనిపించింది' అని ఆయన తెలిపాడు. కాగా, పోలీసులు పేలుడు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.