రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోండి: AO

VKB: పరిగి మండల రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రజిత సూచించారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారం, నామిని ఫారం, పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ జిరాక్స్ అవసరం.