రంగశాయిపేట్ ప్రభుత్వ పాఠశాలలో చెస్ బోర్డుల పంపిణీ
వరంగల్ నగరంలోని రంగశాయిపేట్ ప్రభుత్వ పాఠశాలలో మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చదరంగం బోర్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. మాటా ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.