BREAKING: రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ

BREAKING: రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. భారత్ తరఫున 67 టెస్టులు ఆడిన రోహిత్ 4301 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.