అమెరికా అక్కసు.. భారత్‌ను నిందిస్తూ యాడ్
H-1B వీసాదారులపై అమెరికా యంత్రాంగం అక్కసు వెళ్లగక్కింది. ఈ మేరకు లేబర్ డిపార్ట్‌మెంట్ X వేదికగా ఓ యాడ్ వీడియోను షేర్ చేసింది. H-1B వీసాను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికన్ యువత స్థానంలో విదేశీ కార్మికులతో భర్తీ చేస్తున్నాయని ఆరోపించింది. ఆ వీసాదారుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారని ఆక్షేపించింది.