VIDEO: జల్ జీవన్ మిషన్ పనులకు ప్రారంభించిన డైరెక్టర్
ASR: రాజవొమ్మంగి గ్రామంలోని శ్రీరామ్ నగర్లో జల్ జీవన్ మిషన్ పైప్‌లైన్ పనులను మంగళవారం ఏఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దిరాజు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు అందించేందుకు భాగంగా 700 మీటర్ల మేర కొత్త పైప్‌లైన్ వేయనున్నట్లు తెలిపారు. ఆర్డబ్ల్యుఎస్ జేఈ నాయక్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.