'పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి'
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు, అంబాసిడర్లకు గత ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వలేదంటూ మంగళవారం స్థానిక గ్రామ సచివాలయం వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, గత ఐదు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలియజేశారు.