విద్యుత్ ఘాతంతో ఒకరు మృతి

విద్యుత్ ఘాతంతో ఒకరు మృతి

SRPT: విద్యుత్ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన హుజూర్ నగర్ పట్టణంలో నిన్న సాయంత్రం చోటుచేసుకుంది. వాటర్ ప్లాంట్‌లో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న కృష్ణ పట్టణంలోని ముత్యాలమ్మ బజారులో ఓ ఇంటివద్ద వాటర్ ట్యాంక్ నింపడానికి వెళ్లాడు. ఈ క్రమంలో మోటార్ స్విచ్ ప్లగ్ పెట్టే సమయంలో విద్యుత్ ఘాతానికి గురి కాగా, అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.